ఏపి-టిజి 10 డేస్ రిపోర్ట్ : బాహుబలి @75 కోట్లు

Baahubali-still

తెలుగు చలన చరిత్రలో, ఇండియన్ చలన చిత్ర చరిత్రలో వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే వార్తల్లో ఎక్కువగా నిలిచిన బాహుబలి రిలీజ్ తర్వాత అంతకు మించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దానికి కారణం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ సునామీని సృష్టిస్తుండడం. కేవలం 4 రోజుల్లోనే తెలుగు చలన చిత్ర సీమ ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానంలో నిలబడిన సినిమా ‘బాహుబలి’ మొదటి వారంలో ఒక్క తెలుగులోనే 100కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. అంతే కాకుండా గ్రాస్ పరంగా మొదటి పది రోజుల్లో 325కోట్లు కలెక్ట్ చేసింది.

తెలుగు చలన చిత్ర దశ, దిశని మార్చి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్ళి ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇలాంటివన్నీ ఆడియన్స్ ని రంజింపజేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోన్న బాహుబలి కేవలం ఆంధ్ర – తెలంగాణలతో కలుపుకొని మొదటి 10 రోజుల్లో 75 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఒక్క ఏపి, తెలంగాణలో వచ్చిన షేర్ తోనే బాహుబలి సినిమా టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ అత్తారింటికి దారేదిని క్రాస్ చేసిందని చెప్పవచ్చు. మొదటి 10 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు..

ఏరియా కలెక్షన్స్(షేర్)
నైజాం 28.32 కోట్లు
సీడెడ్ 15.70 కోట్లు
నెల్లూరు  2.87 కోట్లు
గుంటూరు 6.82 కోట్లు
కృష్ణా 4.72 కోట్లు
పశ్చిమ గోదావరి 5.33 కోట్లు
తూర్పు గోదావరి 6.46 కోట్లు
వైజాగ్ 6.49 కోట్లు
మొత్తం : 76.71 కోట్లు
Exit mobile version