
ఒకే ఒక్క నిమిషం చేసిన అతిధి పాత్రతోనే తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న అక్కినేని యువ తరంగం అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న తొలి సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అఖిల్ ఫస్ట్ మూవీకి టాలీవుడ్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే 85% షూటింగ్ దాకా పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు మేకింగ్ వీడియోస్ ద్వారా అఖిల్ అంచనాలను మరింత పెంచేసాడు. దీంతో ఈ సినిమాకి బిజినెస్ పరంగా సూపర్బ్ క్రేజ్ నెలకొంది.
ఇప్పటికే నైజాం రైట్స్ ని సుమారు 13 కోట్లకి దేవీ ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారని తెలియజేశాం. ఇదే స్థాయిలోనే ప్రతి ఏరియాలోనూ భారీ రేటుకు అఖిల్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడు పోతున్నాయి. మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 2.5కోట్లకి అమ్ముడు పోయాయి. కృష్ణా జిల్లాలో అఖిల్ మొదటి సినిమాకే ఈ రేటు పలకడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మిగిలిన అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. డెబ్యూ మూవీ అయినా అఖిల్ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుండడం నిర్మాతలకి ఆనందాన్ని ఇస్తోంది. అఖిల్ మొదటి సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా ద్వారా అఖిల్ తో పాటు బాలీవుడ్ భామ సయేషా సైగల్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.