
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడుతున్న పేరు విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, భాజరంగీ భాయ్ జాన్ ల సినిమాలకు కధను అందించి యమ పాపులర్ అయిపోయాడు. ఈ రెండు సినిమాలు ఇండియా లెవల్లోనే అత్యుత్తమ బిజినెస్ చేయడంతో ఫోర్బ్స్ వంటి ప్రధాన పత్రిక సైతం ఈయనపై ఒక కవర్ స్టోరీని డిజైన్ చేసింది.
72ఏళ్ళ వయసులో విజయేంద్ర ప్రసాద్ క్రియేటివ్ థింకింగ్ ని, కధా రచనా శైలిని ఈ పత్రిక కొనియాడింది. అంతేకాక ఈ రెండు కధలకు ఎంతో వ్యత్యాసం వుండడం కూడా గమనార్హం.