చెర్రీ సినిమాపై వచ్చిన కథనాలపై కోన వెంకట్ క్లారిటీ!

Kona-Venkat3
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదల కాకముందే ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలు ఉండడం విశేషం! ఈ సినిమా టైటిల్ దగ్గర్నుంచీ, సినిమాలో కామెడీ ఎలా ఉండబోతోందీ? రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు? చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారా? ఇలా రకరకాల ఊహాగానాలు వెలువడుతూ ఆసక్తికర కథనాలకు, పుకార్లకు ఆద్యం పోస్తున్నాయి. అయితే వీటి గురించి ఇప్పటివరకూ చెర్రీ సినిమా యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

తాజాగా ఈ కథనాల గురించి రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమా రచయిత కోన వెంకట్ స్పందించారు. “రామ్ చరణ్ సినిమాపై రకరకాల ఊహాగానాలు, పుకార్లు వినబడుతున్నాయి. దయచేసి అవన్నీ నమ్మకండి. ఏదైనా ఉంటే స్వయంగా మేమే చెప్తాం. కొన్ని సార్లు పుకార్లు నవ్వు తెప్పించేవిగా ఉంటాయి” అంటూ యూనిట్ తరపున స్పష్టం చేశారు. మరి కోన వెంకట్ పైన వినిపిస్తున్న ఊహాగానాల్లో దేనిగురించి ప్రత్యేకంగా మాట్లాడారన్నది ఆసక్తికర అంశం. అయితే చెర్రీ సినిమాలో చిరంజీవి ఓ చిన్న గెస్ట్ రోల్ చేయనున్నారనే విషయంపై ఆయన మాట్లాడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Exit mobile version