ఫ్లాప్ అయిన ప్రయోగాలపై స్పందించిన మహేష్ బాబు

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఎన్నడూ లేనంతగా శ్రీమంతుడు సినిమాని ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా వరుసగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు, నిన్న సాయంత్రం కూడా ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. మహేష్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓక నటుడిగా తను చేసిన ప్రయోగాత్మక సినిమాల గురించి మాట్లాడాడు.

‘ఓ సరికొత్త పాత్ బ్రేకింగ్ మూవీ అయిన 1 నేనొక్కడినే లాంటి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాఫ్ అవ్వడం నన్ను బాగా నిరుత్సాహపరిచింది. అలాంటి ప్రయోగాత్మక సినిమాలను స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పాలి. కానీ ఆ విషయంలో అది ఫెయిల్ అయ్యింది. ఫ్యూచర్ లో కూడా అలాంటి సినిమాలు వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను. కానీ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రావాలని’ మహేష్ ఆబు తెలిపాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంటే జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version