‘స్పిరిట్’ వాయిదా పడిందా? సాలిడ్ క్లారిటీ బయటకి

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఒకటి. ఈ సినిమా మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ లో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ క్రేజీ కలయికలో సినిమా వాయిదా పడింది అంటూ వచ్చిన పలు రూమర్స్ ఇపుడు ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్ ఆలస్యంగా వెళుతున్న నేపథ్యంలో వాయిదా కన్ఫర్మ్ అన్నట్టే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈ రూమర్స్ పై సాలిడ్ క్లారిటీ వచ్చింది. స్పిరిట్ వాయిదా రూమర్స్ లో నిజం లేదని టీం ఖంచించారు.

పైగా సినిమా అనుకున్న డేట్ అంటే మార్చ్ 5నే థియేటర్స్ లో వస్తుంది అని మరోమారు ఖరారు చేశారు. సో స్పిరిట్ పై ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే టీ సిరీస్ మరియు భద్రకాళీ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version