
ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీమంతుడు రిలీజ్ కావడానికి మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. శ్రీమంతుడు సినిమాని ‘సెల్వందన్’ పేరుతో తమిళంలోకి డబ్ చేసి ఒకేసారి రిలీజ్ చేయనున్న సంగతి మనకు తెలిసిందే. తమిళ వెర్షన్ ఆడియోని కూడా ఆగష్టు 4న గ్రాండ్ గా చెన్నైలో లాంచ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే సెల్వందన్ కి జరుగుతున్న బిజినెస్ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
మేము పర్సనల్ గా తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న నిర్మాతల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తమిళ వెర్షన్ లో కూడా శ్రీమంతుడు బిజినెస్ కి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఒక వారం రోజుల ముందే అక్కడ సెల్వందన్ రైట్స్ అన్నీ అమ్ముడు పోయాయి. ఇప్పటికే నిర్మాతలకి సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని సమాచారం. రిలీజ్ కి వారం రోజుల ముందే బిజినెస్ మొత్తం అయిపోవడమే కాకుండా లాభాలు తెచ్చిపెట్టడంతో తమిళ నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ అవ్వడం చూసి తమిళ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.
మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా జోడీ కట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.