
‘చిన్నదానా నీకోసం’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుడు యంగ్ హీరో నితిన్. ఈ గ్యాప్ లో అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ బిజీగా ఉన్నాడు నితిన్. ఇటీవలే నితిన్ హీరోగా చేయబోయే తన తదుపరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయనుండడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరున అధికారికంగా ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి తమిళ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎన్నిక చేసినట్లు సమాచారం.
‘కొలవెరి డి’ పాటతో ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. ప్రస్తుతం తమిళంలో ట్రెండ్ స్తేట్టింగ్ మ్యూజిక్ ఇస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అనిరుధ్ రవిచంద్రన్ ని నితిన్ – త్రివిక్రమ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అనిరుధ్ ని ఇది వరకూ రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా కోసం అనుకున్నా అది కార్య రూపం దాల్చలేదు. ఫైనల్ గా నితిన్ సినిమాతో తెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు నితిన్ కి జోడీ కోసం అందాల భామ సమంతని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాని హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నాడు.