యుఎస్ లో ‘శ్రీమంతుడు’ ప్రీమియర్స్ టార్గెట్ 1మిలియన్

srimanthudu (2)
మరికొద్ది గంటల్లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా ‘శ్రీమంతుడు’. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మహేహ్స్ కి లోకల్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అందుకే మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాని ఓవర్సీస్ లో 160 లొకేషన్స్ లో ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ శ్రీమంతుడు ప్రీమియర్ షోస్ తోనే ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోస్ టికెట్స్ కోసం ఫుల్ క్రేజ్ నెలకొనడంతో టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి.

‘శ్రీమంతుడు’ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. తన మొదటి సినిమా మిర్చి ఓవర్సీస్ లో సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు కొరటాల శివ – మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్యలు మహేష్ కి తల్లితండ్రులుగా కనిపించనుంటే, రాహుల్ రవీంద్రన్ మహేష్ కి కజిన్ బ్రదర్ గా కనిపించనున్నాడు. ఎరోస్ వారు ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ని దక్కించుకున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version