మహేష్ ‘శ్రీమంతుడు’కి మంచి ఓపెనింగ్స్!

Srimanthudu
‘శ్రీమంతుడు’గా మహేష్‌ను చూడడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు నేటితో ఆ ఎదురుచూపులకు తెరపడింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున నేడు విడుదలైంది. రెండు వరుస పరాజయాల తర్వాత ఈసారి మహేష్ కచ్చితంగా హిట్ కొడతాడన్న నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, మొదటి నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. మహేష్‌కు ఏపీ, తెలంగాణాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేశారు.

ఇక విడుదలైన అన్ని చోట్లా దాదాపు హౌస్‌ఫుల్ బోర్డ్స్‌తో కనిపించిన ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లలో టాప్ స్థానాల్లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ టాక్! ఇప్పటికే అంతటా పాజిటివ్ టాక్ కూడా వచ్చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదటిరోజు కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉండనున్నాయనేది తెలియాలంటే రేపటిదాకా ఆగాలి. అయితే ట్రేడ్ అంచనాల ప్రకారం మొదటి రోజు కలెక్షన్ల విషయంలో బాహుబలి తర్వాతి స్థానాన్ని శ్రీమంతుడు నిలుస్తుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌‍గా నటించింది. ఇక మహేష్ బాబు ఈ సినిమాకు మేజర్ హైలైట్‍గా నిలిచారన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Exit mobile version