రాజస్థాన్‌లో భారీ ఎత్తున విక్రమ్ సినిమా క్లైమాక్స్ ఫైట్

vikram
తమిళ స్టార్ హీరో విక్రమ్ ‘ఐ’ తర్వాత చేస్తోన్న సినిమా ’10 ఎంద్రతుకుల్ల’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ నిర్మాతగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. ఓ రోడ్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకుడు. ఓ సరికొత్త కథ, అంతకుమించి సరికొత్త యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల థ్రిల్ చేసేలా ఉంటుందని సినిమా యూనిట్ సమాచారం. ఈ కోవలోనే రాజస్థాన్‌లో ఓ భారీ క్లైమాక్స్ ఫైట్‌ను ప్లాన్ చేశారు.

ఈనెల 21న రాజస్థాన్‌లో క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ ఫైట్‌లో ట్రైన్ నేపథ్యంలో వచ్చే ఫైట్ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వనుందట. అదలా ఉంటే ఈ థ్రిల్లర్ టైటిల్‌కు తగ్గట్టుగానే (10 ఎంద్రకుల్ల అంటే పది లెక్కపెట్టేలోపు) ప్రతీ ఒక్కరినీ సీట్లకు అతుక్కుపోయేలా కూర్చోబెడుతుందని సమాచారం. ఆగష్టు 15న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఒకటి విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత ఏ.ఆర్.మురుగదాస్ తెలిపారు.

Exit mobile version