బర్త్ డే గిఫ్ట్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్న మహేష్

Mahesh-Babu
సోషల్ మెసేజ్ ఉన్న కథ., కానీ దాన్ని కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చేసిన దర్శకుడిని నమ్మి ఓ స్టార్ హీరో సినిమా చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి కథని, దర్శకుడైన కొరటాల శివని నమ్మి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘శ్రీమంతుడు’. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం మొదలెట్టింది. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు, తన బర్త్ డే కానుకగా ప్రేక్షకులకు అందించిన శ్రీమంతుడు సినిమా అందరినీ మెప్పించి సూపర్ హిట్ అవ్వడంతో, అభిమానులు ఇచ్చిన ఈ బర్త్ డే తన కెరీర్లో మరువలేనిదని మహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు.

1975 ఆగష్టు 9న సూపర్ స్టార్ కృష్ణ గారికి వారసుడిగా ఘట్టమనేని మహేష్ బాబుగా జన్మించాడు. మహేష్ బాబు బాల్యం, స్టడీస్ అంతా చెన్నైలోని వాళ్ళ భామ్మ దగ్గరే గడిచింది. చెన్నై లయోలా కాలేజ్ లో కామర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కృష్ణ గారు నటించిన ‘గూడాచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాలచంద్రుడు’ లాంటి సినిమాల్లో బాల నటుడిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత 1999లో ‘రాజకుమారుడు’ సినిమాతోమహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన ‘మురారి’, ‘ఒక్కడు’తో స్టార్డం వచ్చింది. ఆ తర్వాత మహేష్ చేసిన ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో సూపర్ హిట్స్ అందుకున్నాడు. శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో నటించనున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

Exit mobile version