యుఎస్ రికార్డ్ : ‘శ్రీమంతుడు’ 2 మిలియన్ మార్క్.!

Srimanthudu

ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే కామన్ గా అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి, అదే ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటే ఆ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం కష్టమే, కానీ రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకుంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది. ఒక్క లోకల్ లోనే కాకుండా మహేష్ బాబుకి మంచి మార్కెట్ ఉన్న యుఎస్ లో కూడా మంచి కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది.

మొదటి రోజు ప్రీమియర్స్ తో కూడా కలుపుకొని 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన శ్రీమంతుడు సినిమా రెండవ రోజు కూడా అదే రేంజ్ కలెక్షన్స్ సాధించింది. మేము ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం.. రెండవ రోజుతో కలుపుకొని $1.75 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ఈజీగా 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేస్తుందని సమాచారం. రెండవ రోజుతో మహేష్ బాబు తన ప్రీవియస్ అత్యధిక రికార్డ్ అయిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంగ్ రన్ కలెక్షన్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. అంతే కాకుండా ఫస్ట్ వీకెండ్ తో ‘అత్తారింటికి దారేది’ రికార్డ్ ని కోరా బ్రేక్ చేసి ఓవర్సీస్ లో బాహుబలి తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలుస్తుందని సమాచారం. లాంగ్ రన్ లో 3 మిలియన్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Exit mobile version