తనకు కథ నచ్చితే కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ ముందుండే హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య హీరోగా నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్’. ఈ సినిమాని తన కెరీర్లోనే పూర్తి డిఫరెంట్ గా ఉండేలా ట్రై చెయ్యాలనుకున్న బాలకృష్ణ ఈ సినిమా కోసం టాలీవుడ్ క్రేజీ టీంని ఒకటి చేసాడు. వారే శ్రీవాస్ – కోన వెంకట్ – గోపీమోహన్. జూలై 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అందులో భాగంగా మొదటగా నానక్‌రామ్ గూడాలో వేసిన ఓ స్పెషల్ హౌస్ సెట్ లో కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. గత 20 రోజులుగా కొన్ని సీన్స్ తీయడంలో బిజీగా ఉన్న ఈ చిత్ర టీం రేపటి నుంచి ఓ పాటని షూట్ చెయ్యడం కోసం సిద్దమయ్యారు.
ఇప్పటికే నందమూరి బాలకృష్ణపై వచ్చే ఓ సూపర్బ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని కంపోజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. రేపటి నుంచి హైదరాబాద్ లో బాలకృష్ణపై ఈ పాటని షూట్ చేయనున్నారు. ఈ పాటని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేయనున్నాడు. బాలకృష్ణ ఈ సినిమా కోసం 12 కేజీల బరువు తగ్గి చాలా స్లిమ్ అవ్వడమే కాకుండా మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్. కోన వెంకట్ – గోపి మోహన్ – ఎం.రత్నం – శ్రీధర్ సీపాన కలిసి కథ- డైలాగ్స్‌ని అందించిన ఈ సినిమాని శ్రీవాస్ ఇరోస్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఉండేలా కథని రెడీ చేసారు.
