‘రోబో 2’ ఫైనల్ స్క్రిప్ట్ కి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్

rajnikanth

భాషతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రజినీకాంత్. ఆయన సినిమాలు అన్నీ సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతుంటాయి. అలాంటి సూపర్ స్టార్ రజినీ భారీ బడ్జెట్ మరియు గ్రాండ్ విజువల్స్ సినిమాలని సౌత్ ప్రేక్షకులకి పరిచయం చేసి ది నెంబర్ 1 కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్న శంకర్ కాంబినేషన్ లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన విజువల్ ట్రీట్ ‘రోబో’ సినిమా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి అప్పట్లో కలెక్షన్స్ పరంగా సౌత్ ఇండియన్ నెంబర్ 1 ఫిల్మ్ గా రికార్డ్ సాధించింది. చాలా రోజుల నుంచి రోబో 2′ తెరకెక్కనుందని పలు వార్తలు వినిపిస్తున్నా కచ్చితమైన సమాచారం మాత్రం మాత్రం లేదు.

కానీ మేము తెలుసుకున్న తాజా సమాచారం ప్రకారం, ‘రోబో 2’ కి సంబందించిన స్క్రిప్ట్ సిద్దమైంది. కొద్ది రోజుల క్రితమే శంకర్ ఈ ఫుల్ స్క్రిప్ట్ ని రజినీకాంత్ కి చెప్పడం, ఆ స్క్రిప్ట్ కి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. రోబో 2 కథ కోసం శంకర్ మొదటిసారి మలయాళ ఫేమస్ నవలా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ బి. జేయమోహన్ తో కలిసి వర్క్ చేసాడు. రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఈ నెలలోనే శంకర్ మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా వర్క్ చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. రోబో 2 కి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం అభిమానులకు ఓ శుభవార్త. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే మిగిలిన నటీనటుల్ని ఫైనలైజ్ చేస్తారు.

Exit mobile version