
గట్టిగా కొడితే ఒక తెలుగు సినిమా బాక్స్ ఆఫీసు స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందనే విషయాన్నీ ఇండియా మరియు ప్రపంచ బాక్స్ ఆఫీసు కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు అద్భుత సృష్టిగా మునుపెన్నడూ చూడని, కనీవినీ ఎరుగని భారీ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 రోజులు అయినా కలెక్షన్స్ పరంగా మాత్రం ఇంకా జోరు తగ్గలేదు. ఒక తెలుగు సినిమా 100 కోట్ల మార్క్ క్రాస్ చేయడమే ఎక్కువ అనుకునే టైం బాహుబలి సినిమా అందరి కామెంట్స్ ని పటాపంచలు చేస్తూ 500 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్ సృష్టించడమే కాకుండా బాలీవుడ్ ని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది.
అక్కడితో ఆగకుండా లేటెస్ట్ గా బాహుబలి మరో బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘ధూమ్ 3’ సినిమా ఓవరాల్ గా 542 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ అత్యధిక గ్రాసర్స్ లో 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ ని బాహుబలి బ్రేక్ చేసి 545 కోట్ల హ్గ్రాస్ తో ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో 3వ స్థానాన్ని దక్కించుకుంది. అమీర్ ఖాన్ నటించిన పికె సినిమా 700 కోట్లకి పైనే గ్రాస్ సాధించి మొదటి ప్లేస్ లో ఉంటే, సల్మాన్ ఖాన్ బజ్రంగి భాయ్ జాన్ 565 కోట్ల గ్రాస్(స్టిల్ కౌంటింగ్)తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత బాహుబలి, ధూమ్ 3 సినిమాలు ఉన్నాయి. ఈ రికార్డ్ ని తెలుగు వారంతా చాలా గర్వంగా ఫీలవుతున్నారు.
ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ సినిమా ఫారెన్ లాంగ్వేజ్ వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలిలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణలు ముఖ్య పాత్రలు పోషించారు.