
సూపర్ హిట్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందన్నా లేదా ఓ క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందన్నా లేదా ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఫార్మాట్ లో మరో సినిమా వస్తుందన్నా.. అలాంటి సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటనే టాలీవుడ్ లో చోటు చేసుకుంటోంది. కేవలం నెల రోజుల క్రితం వచ్చిన ఫస్ట్ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, ఇండియా వ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. కథలు వేరు వేరైనా అదే గ్రాండ్ విజువల్స్, రాజుల కథ ఫ్లేవర్ లో వస్తున్న ఫస్ట్ ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’.
బాహుబలి రిలీజ్ అయిన 2 నెలల గ్యాప్ లోనే రుద్రమదేవి రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకి బిజినెస్ పరంగా సూపర్బ్ క్రేజ్ నెలకొంది. బాహుబలి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్ట్ చేసిన కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూటర్స్ రుద్రమదేవి సినిమా రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఒక్కసారిగా అన్ని ఏరియాల నుంచి రుద్రమదేవి సినిమా భారీ భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే రిలీజ్ కి ముందే శాటిలైట్ రైట్స్ కి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత అయిన గుణశేఖర్ రైట్స్ ని ఎవరికి, ఇంతకి అమ్మాలి అనే పనిలో బిజీగా ఉన్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
రుద్రమదేవి టైటిల్ రోల్ లో అనుష్క కనిపించనున్న ఈ సినిమాలో రానా చాళుక్య వీరభద్రుడుగా కనిపించనుంటే, అల్లు అర్జున్ గోనగన్నా రెడ్డిగా కనిపించనున్నాడు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు.