5 రోజుల్లో 50 కోట్లు టచ్ చేసిన మహేష్ ‘శ్రీమంతుడు’

srimanthudu (2)
కొరటాల శివ మొదటి సినిమా మిర్చి చూడటానికి చాలా కమర్షియల్ గా ఉంటుంది, కానీ కథలో అండర్ కరెంట్ గా ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఇదే ఫార్ములాని తన సెకండ్ మూవీ శ్రీమంతుడులో కూడా ఫాలో అయ్యాడు కొరటాల శివ. ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ని తీసుకొని దానిని కమర్షియల్ గా చెప్పడంలో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిన సినిమా ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది. శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా మహేష్ బాబు ప్రీవియస్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది.

తాజాగా మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద న్యూ ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసింది. శ్రీమంతుడు ఫస్ట్ వీకెండ్ లో ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో మరో మూడు రోజుల్లో శ్రీమంతుడు 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అన్నాయి, కానీ వారందరినీ షాక్ చేస్తూ కేవలం మొదటి 5 రోజుల్లోనే శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద ఇదొక న్యూ ల్యాండ్ మార్క్ గా నమోదైంది.

మహేష్ బాబు సరసన మొదటిసారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మైత్రి మూవీ మేకర్స్ వారు శ్రీమంతుడు సక్సెస్ తో చాలా హ్యాపీగా ఉన్నారు

Exit mobile version