సోనీ మ్యూజిక్ ద్వారా విక్రమ్ సినిమా ఆడియో!

10
తమిళ స్టార్ హీరో విక్రమ్ ‘ఐ’ తర్వాత చేస్తోన్న సినిమా ’10 ఎంద్రతుకుల్ల’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. ఇక కేవలం దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ పలు ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటూ వెళుతోన్న మురుగదాస్, ఈ సినిమాను ఓ రోడ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. విజయ్ మిల్టన్ ఈ సినిమాకు దర్శకుడు. ఓ సరికొత్త కథ, అంతకుమించి సరికొత్త యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల థ్రిల్ చేసేలా ఉంటుందని సినిమా యూనిట్ సమాచారం.

ఇక తాజా సమాచారం మేరకు ప్రముఖ మ్యూజిక్ సంస్థ సోనీ మ్యూజిక్ ఈ సినిమా ఆడియో హక్కులను పెద్ద మొత్తానికి కొనుగోలు చేసిందని తెలుస్తోంది. డి. ఇమ్మన్ సంగీత దర్శకత్వంలో వస్తోన్న ఆడియోపై సినిమాకున్న రేంజ్ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు సోని సంస్థ ఈ సినిమాతో జత కట్టడంతో మరింత అంచనాలు పెరిగాయనే చెప్పాలి. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. ఈనెల 13న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నామని సినిమా యూనిట్ తెలిపింది. ఇక అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత ఏ.ఆర్.మురుగదాస్ ఇంతకుముందే తెలిపారు.

Exit mobile version