‘శ్రీమంతుడు’తో ‘శుభలగ్నం’ రోజులు గుర్తొచ్చాయ్ : జగపతి బాబు

jagapathi babu
హీరోగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు, తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయి అద్భుతమైన రెండో ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే జగపతి బాబు నటించిన పలు సినిమాల్లో ఆయన పాత్రలు ఆ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాక, యాడెడ్ అడ్వాంటేజ్‌గా నిలిచాయి. తాజాగా మహేష్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన శ్రీమంతుడులో జగపతి మహేష్ తండ్రిగా ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే!

తండ్రి-కొడుకుల బంధం ఓ బలమైన సబ్‌ప్లాట్‌లో ఉన్న సినిమాలో జగపతి బాబు పాత్ర బాగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా విషయానికి వస్తే మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో జగపతి బాబు పాల్గొని తన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమా ఇంతపెద్ద విజయం సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తాను హీరోగా నటించిన ‘శుభలగ్నం’ సినిమాకు వర్షా కాలంలోనూ ఫ్యామిలో ఆడియన్స్ బ్రహ్మ్రరథం పట్టారని, ఈ సినిమాకు అంతకుమించి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం చూశాక ఆ రోజులు గుర్తొస్తున్నాయని తెలిపారు. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు.

Exit mobile version