నిఖిల్ ‘శంకరాభరణం’ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్?

Nikhil
సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాలతో మనముందుకు వచ్చి, వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న హీరో నిఖిల్. తెలుగులో ఏ హీరోకైనా హ్యాట్రిక్ హిట్ అన్నది అంత ఈజీ విషయం కాదు. నిఖిల్ ఆ ఘనతను కూడా సొంతం చేసుకొని ప్రస్తుతం ‘శంకరాభరణం’తో మరో సరికొత్త క్రైమ్ కామెడీ చేస్తున్నారు. కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ రిచ్ ఎన్నరై ఓ మారుమూల ప్రాంతంలో చిక్కుకోవడమనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

ఇక షూటింగ్ మొదలైన రోజే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచీ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉండనుందని కోన వెంకట్ చెబుతూ వస్తున్నారు. ఇక శంకరాభరణం సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నామని సినిమా యూనిట్ తెలిపింది. మోషన్ పోస్టర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా, ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆగష్టు 15న ఇతర తెలుగు సినిమాలు కూడా ఫస్ట్‌లుక్, టీజర్, అంటూ హంగామా చేయనుండడంతో సినిమా అభిమానులకు ఆరోజు మరో విశేషం అవుతుందనే చెప్పొచ్చు.

Exit mobile version