సక్సెస్‌పుల్‌గా రెండోవారంలోకి ‘శ్రీమంతుడు’

srimanthudu
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాటినుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక సోషల్ మెసేజ్ ఉన్న కథాంశాన్ని కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన విధానానికి అన్ని వర్గాల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులే కాక రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించడం విశేషంగా కనిపిస్తూ వచ్చింది.

మొదటి వారం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా, నేటితో అదే ఊపును కొనసాగిస్తూ రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో వారం కూడా హౌస్‌ఫుల్ థియేటర్లతో సినిమా నడుస్తూ ఉండడం విశేషంగా కనిపిస్తోంది. రేపు, ఎల్లుండి సెలవు దినాలు కావడం శ్రీమంతుడుకి మరింత కలిసి వచ్చే అంశం. ఇప్పటికే 50 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్‌రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరం అంశం. ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా మంచి ఆసక్తి కనబరుస్తూండడంతో లాంగ్‌రన్‌లోనూ మంచి కలెక్షన్లే రావచ్చని ట్రేడ్ టాక్. మైత్రీ మూవీస్ బ్యానర్‌తో కలిసి మహేష్ ఈ సినిమాను స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే! మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరి పెయిర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Exit mobile version