
ఏక కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన రెండు పీరియాడికల్ ఫిల్మ్స్ ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’. బాహుబలి సినిమా నెల రోజుల క్రితమే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరి చూపు అదే జోనర్లో వస్తున్న ‘రుద్రమదేవి’పై పడింది. ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ కోసం 9 ఏళ్ళు పాటు క్షుణ్ణంగా పరిశోధించి గుణశేఖర్ ఈ సినిమా తీసాడు. ఇండియన్ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీగా వస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కి కేవలం 3 వారల టైం మాత్రమే ఉంది. దాంతో ఈ చిత్ర టీం ప్రమోషన్స్ ని ఇప్పటి నుంచే ప్రారంభించనున్నారు. అందులో బాగంగానే ఈ రోజు ఈ చిత్ర టీంలోని మెయిన్ మెంబర్స్ అంతా సిఎంఆర్ గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో లో జరగబోయే ఓ వేడుకకి హాజరు కానున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాత్రల పరిచయ పోస్టర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాకి సూపర్బ్ బిజినెస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో, మలయాళంలో కూడా మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ రోల్ లో అనుష్క కనిపించనుంది. తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం మరో స్పెషల్ అట్రాక్షన్.
రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రానా, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.