రీల్ హీరో టు రియల్ హీరోగా మారిన ‘శ్రీమంతుడు’

mahesh

తెలుగు స్టార్ హీరోలు తమ సినిమాల ద్వారా ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కంటెంట్ ని చెప్పడం ఈ మధ్య కాలంలో బాగా తగ్గిందని చెప్పాలి. కమర్షియల్ సినిమాలే ఎక్కువ వస్తున్న ఈ టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ బారియర్ ని బ్రేక్ చేసి ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ తో చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. ‘పుట్టి పెరిగిన ఊరిని మరిచిపోకూడదని, ఆ ఊరికి ఏదో చెయ్యాలని, అవసరం అయితే దత్తత తీసుకొని మరీ ఊరిని బాగు చెయ్యాలని’ శ్రీమంతుడు సినిమాలో చెప్పారు. కేవలం మొదటి నుంచి ఒకే మెసేజ్ ని చెప్పకుండా కమర్షియల్ యాంగిల్ లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను పొందు పరుస్తూ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది.

ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రజలకు థాంక్స్ చెప్పడం కోసం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుని సినిమాలో ఊరిని దత్తత తీసుకోవాలని చెప్పారు, మరి మీరెప్పుడు మీ ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకోనున్నారు అని అడిగితే ‘ ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను. త్వరలోనే ఆ విషయంపై క్లారిటీ ఇస్తాను, కచ్చితంగా బుర్రిపాలెంని దత్తత తీసుకుంతానూ. మరో రెండు మూడు నెలల్లో వర్క్ కూడా మొదలు పెడతానని’ మహేష్ బాబు తెలిపాడు. ఈ స్టేట్మెంట్ తో మహేష్ బాబు కేవలం రీల్ హీరోనే కాదు, నిజ జీవితంలో కూడా రియల్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉండడమే కాకుండా, చాలా గర్వంగా ఫీలవుతున్నారు.

Exit mobile version