అన్ని వర్గాలకు నచ్చే సినిమా బ్రహ్మోత్సవం – శ్రీకాంత్ అడ్డాల

srikanth-addala
‘కొత్తబంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు ‘ముకుంద’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆయన చేయనున్న మరో కుటుంబ కథా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ సినిమా కొద్ది నెలల క్రితమే అధికారికంగా ప్రారంభమైంది. మొదట జూలై నుంచి సెట్స్ పైకి తీసుకెళ్దాం అనుకున్నా మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వలన షూటింగ్ ని సెప్టెంబర్ కి వాయిదా వేసారు. సెప్టెంబర్ 14 నుంచి ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ విజయవాడలో మొదలు కానుంది.

ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని మహేష్ బాబు ఇటీవలే తెలిపాడు. రీసెంట్ గా జరిగిన మీడియా సమక్షంలో శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా గురించిన కొన్ని విషయాలను తెలియజేశాడు. ‘నాగ గత సినిమాల్లానే బ్రహ్మోత్సవం కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతే కాకుండా మహేష్ బాబు అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే అని పరిమితి లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా బ్రహ్మోత్సవం’ అని శ్రీకాంత్ అడ్డాల తెలిపాడు. ఈ మూవీలో మహేష్ బాబు ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు. వారే సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత. పివిపి బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నాడు.

Exit mobile version