టాప్ డైరెక్టర్స్ తో మూవీస్ లైనప్ చేసిన మహేష్ బాబు

Mahesh-Babu
టాలీవుడ్ సూపర్ సత్ర మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ ఖుషీ ఖుషీగా ఉన్నాడు. దానికి కారణం ఏమిటా అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న విడుదలై ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద సుమారు 60కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మహేష్ బాబు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న మరో పూర్తి కుటుంబ కథా చిత్రం ‘బ్రహ్మోత్సవం’.

గతలో మహేష్ బాబు – వెంకటేష్ లతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా తీసిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి డైరెక్టర్. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 14 నుంచి మొదలు కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరి డైరెక్షన్ లో సినిమాని మొదలు పెడతాడు అనేదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడు. రీసెంట్ గా మహేష్ బాబు తెలిపిన సమాచారం ప్రకారం తన తదుపరి సినిమాలు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ రాజమౌళి, పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తాన్నని ఖరారు చేసాడు. కానీ వీరి ముగ్గురిలో ఎవరి సినిమా ముందు అనేది క్లారిటీ లేదు. ఎక్కువ భాగం త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉండచ్చని మహేష్ బాబు సన్నిహితులు చెబుతున్నారు.

కానీ మహేష్ బాబు వీరి ముగ్గురుతో తన తదుపరి సినిమాలు చేయనున్నాడు అని తెలియగానే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. కచ్చితంగా ఈ సినిమాలన్నీ అభిమానులు పెద్ద పండుగ చేసుకునేలా ఉంటాయని వారు భావిస్తున్నారు.

Exit mobile version