99వ సినిమా కోసం 99మందితో బాలయ్య స్టెప్స్.!

balakrishna
కథ నచ్చాలేగానీ అతను కొత్త దర్శకుడా లేక అనుభవమున్న దర్శకుడా అనేవి పట్టించుకోకుండా అవకాశం ఇచ్చేస్తుంటాడు మన మాస్ హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య హీరోగా నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్’. శ్రీవాస్ దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమాని తన కెరీర్లోనే పూర్తి డిఫరెంట్ గా ఉండేలా ట్రై చేస్తున్నాడు బాలకృష్ణ. జూలై 20 నుంచి మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగురోంది. గత నాలుగు రోజులుగా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నానక్రామ్ గూడాలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో బాలకృష్ణ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ‘గం గం గం గణేశా గౌరీ తనయ సర్వేశా’ అంటూ సాగే ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు.

ఈ పాటకి ఓ స్పెషాలిటీ కూడా ఉండదోయ్.. అదేమిటంటే.. డిక్టేటర్ బాలయ్య చేస్తున్న 99వ సినిమా అందుకే బాలయ్య ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లో 99 మంది డాన్సర్స్ తో కలిసి స్టెప్స్ వేస్తున్నాడు. ఈ పాత్రని శ్రీవాస్ చాలా లావిష్ గా ఉండేలా తీయడమే కాకుండా బాలయ్య కెరీర్లో నెంబర్ 1 ఇంట్రడక్షన్ సాంగ్ గా నిలిచేలా షూట్ చేస్తున్నాడు. 99 మంది డాన్సర్లతో పాటు సుమారు 2000మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం 12 కేజీల బరువు తగ్గి చాలా స్లిమ్ అవ్వడమే కాకుండా మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్. కోన వెంకట్ – గోపి మోహన్ – ఎం.రత్నం – శ్రీధర్ సీపాన కలిసి కథ- డైలాగ్స్ని అందించిన ఈ సినిమాని శ్రీవాస్ ఇరోస్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు.

Exit mobile version