చిరు బర్త్ డే పార్టీకి బిగ్ బి & అమీర్ ఖాన్.!

amithab-and-amir-khan
మెగా అభిమానులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే తేదీ మరియు అభిమానులు రెండు రాష్ట్రాల్లో భారీగా సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసే రోజు ఆగష్టు 22. ఈ తేదీ స్పెషాలిటీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం. ఈ ఏడాది చిరంజీవి తన 60వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాడు. అందుకే ఆయన బర్త్ డే వేడుక కోసం అభిమానులు చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. దానితో పాటు చిరంజీవి కూడా ఓ బిగ్ బర్త్ డే పార్టీ ఇవ్వనున్నాడని ఇది వరకే తెలిపాము. ఆగష్టు 22వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్ లో చిరు 60వ బర్త్ డే పార్టీ ఘనంగా జరగనుంది.

ఇప్పటికే ఈ పార్ట్ ఈ కోసం ఇండస్ట్రీలోని ప్రముఖులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరితో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారు. మాకు అందిన సమాచారం ప్రకారం చిరు ఫ్యామిలీ బాలీవుడ్ ప్రముఖులను కోడా ఈ పార్టీకి ఆహ్వానించింది. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లు ఎక్కువ భాగం ఈ పార్టీకి హాజరయ్యే అవకాశం ఉందని చిరు సన్నిహితులు చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు అతని సతీమణి ఉపాసన దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్ చిరు బర్త్ డే కానుకగా ఓ స్టన్నింగ్ గిఫ్ట్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే రామ్ చరణ్ సినిమా ఫస్ట్ టీజర్ ని కూడా ఆ రోజే లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకి సంబందించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడం కోసం 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version