ప్రభాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్

prabhas
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీర్గా నటించిన ‘బాహుబలి’ సినిమా జూలై 10న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సునామీని సృష్టించింది. ఇప్పటి వరకూ తెలుగులోనే ఫేమస్ అయిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఒక్కసారిగా ప్రభాస్ కి తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బాగా క్రేజ్ పెరిగిపోయింది. మలయాళంలో కూడా బాహుబలి సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. దాంతో అక్కడి చిన్న చిన్న నిర్మాతలు ప్రభాస్ తెలుగు సినిమాలను అక్కడ డబింగ్ చేసి రిలీజ్ చెయ్యడానికి డిసైడ్ అయ్యారు.

అందులో బాగంగానే ప్రభాస్ డార్లింగ్, Mr. పర్ఫెక్ట్, మిర్చి సినిమాలను మలయాళంలో డబ్బింగ్ హక్కులను కొనుక్కున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ బాహుబలితో ప్రభాస్ కి వచ్చిన ఇమేజ్ ని బాగా క్యాష్ చేసుకుంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. త్వరలోనే మలయాళంలో మిర్చి సినిమాని రిలీజ్ చేయనున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ‘బాహుబలి స్టార్స్ బ్యాక్’ నే స్పెషల్ ట్యాగ్ లైన్ ని వాడుకుని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న ప్రమోషన్స్ కి మంచి క్రేజ్ ఉంది. బాహుబలి ట్యాగ్ మార్క్ వలన ఈ సినిమాకి మలయాళంలో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేసారు.

Exit mobile version