
‘పండగ చేస్కో’ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో జోరు మీదున్న హీరో రామ్ వరుసగా రెండు సినిమాలను సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో శివం సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకొని పాటల కోసం నార్వేకు షిఫ్ట్ అయింది. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్ ఎనర్జీకి సరిపడే హై రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కలగలిపిన లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
ఇక అక్టోబర్ 2వ తేదీకి ఫిక్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం నార్వేలో శరవేగంగా పాటల షూటింగ్ జరుపుకుంటోంది. నార్వేలోని అట్లాంటిక్ ఓషియన్ రోడ్‌లోని అందమైన లొకేషన్లలో పాటను షూట్ చేస్తున్నారు. పాటల్లో లొకేషన్స్‌తో సినిమాకు మంచి ఫీల్ వస్తుందని రామ్ నమ్మకంగా చెబుతూ వస్తున్నారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి టేకింగ్‌తో పాటు, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్‌గా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది. రామ్ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.