పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బర్త్ డే సర్ప్రైజ్ ఇదేనా.?

Sardaar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే స్టార్ట్ చేసిన ఈ సినిమాలోని మొదటి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసాడు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం నిజమైతే పవన్ అభిమానులకు ఓ పెద్ద ట్రీట్ సిద్దమవుతోంది. అసలు విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా అనగా సెప్టెంబర్ 2న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉందని సమాచారం. ఇది పవన్ అభిమానులకు చాలా పెద్ద ట్రీట్ అని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ షూటింగ్ మొదలు పెట్టిన రోజే ఒక సాంపిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు, అది రిలీజ్ అయిన కొద్ది రోజులకే స్వాతంత్ర్య దినోత్సవం రోజున పవన్ గన్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. తాజాగా బర్త్ డే కానుకగా టీజర్ రిలీజ్ అనడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ దశ నుంచి ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో కలిసి శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version