
‘చిత్రం’, ‘జయం’, ‘నువ్వు నేను’, ‘నిజం’ లాంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఈ మధ్య కాలంలో తనదైన ముద్ర వేసే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న తేజ ఈ సారి తన బ్రాండ్ మార్క్ వాల్యూతో కూడిన ‘హోరా హోరీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ మరోసారి నూతన నటీనటులైన దిలీప్ – దక్షలను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది.
అలా మొదలైంది, అంతక ముందు – ఆ తరువాత సినిమాలతో హిట్స్ అందుకున్న శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి కోడూరి సంగీతం అందించాడు. ఇప్పటికే కళ్యాణి కోడూరి అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ బాగుంది. ‘హోరా హోరీ’ విషయంలో అన్నీ ఆసక్తిని పెంచుతుండడంతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దాంతో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సురేష్ బాబు భాగస్వామి కావడం సినిమాకి మంరింత పాజిటివ్ టాక్ ని తెచ్చి పెట్టింది. ఈ సినిమా ద్వారా తేజ మళ్ళీ తన స్టైల్ లవ్‌స్టోరీని చెబుతూనే, తన పూర్వ వైభవాన్ని అందుకుంటాడని ఆశిస్తున్నారు.