ఇంటర్వ్యూ : దేవకట్ట – సీటు చివర్లో కూర్చొని చూసే యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’

deva-katta
‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ లాంటి హై ఇంటెన్స్ డ్రామా ఉన్న సినిమాలను అందించిన డైరెక్టర్ దేవకట్ట తన కెరీర్లో మొదటి సారి చేసిన రీమేక్ మూవీ ‘డైనమైట్’. మంచు విష్ణు హీరోగా, ప్రణిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాసేపు దేవకట్టతో మాట్లాడి ‘డైనమైట్’ విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ఓన్ కథలతో సినిమాలు చేసే మీరు మీ కెరీర్లో మొదటి సారి రీమేక్ సినిమాని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) మంచు విష్ణుకి తమిళ వెర్షన్ ‘అరిమ నంభి’ బాగా నచ్చి నన్ను చూడమని చెప్పారు. అలాగే సినిమా చూసాను, సినిమా పూర్తయ్యే టైంకి నాకు బాగా నచ్చేసింది. అందులోని పాత్రలు నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి. అందుకే తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు చాలా మార్పులు చేసి ఈ సినిమా డైరెక్ట్ చెయ్యడానికి ఓకే చెప్పేసాను.

ప్రశ్న) రీమేక్ అయిన ‘డైనమైట్’ కోసం ఏమేమి మార్పులు చేసారు.?

స) ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే ఇందులో మేము కొన్ని రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ లను, అలాగే మంచు విష్ణు పాత్రని మరింత ఆసక్తికరంగా ఉండేలా మార్పులు చేసాం. మంచు విష్ణు చాలా రిస్క్ తీసుకొని ఆ స్టంట్స్ చేసాడు. కచ్చితంగా తన లుక్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటాయి.

ప్రశ్న) ఈ సినిమా మేకింగ్ డీటైల్స్ గురించి చెప్పండి.?

స) డైనమైట్ సినిమాని మొత్తం 56 రోజుల్లో, అనుకున్న లిమిటెడ్ బడ్జెట్ లో షూట్ చేసాము. ఈ సినిమా ప్లానింగ్ అంతా విష్ణు చూసుకున్నాడు. తను అన్ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడం వలన నా వర్క్ ఇంకా ఈజీ అయిపోయింది.

ప్రశ్న) మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంటుందనే దానిపై మీ కామెంట్.?

స) డైనమైట్ అనే సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ సీట్ చివర్లో కూర్చొని నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చూసే యాక్షన్ థ్రిల్లర్. సినిమా మొత్తం ఎక్కువగా విష్ణు – ప్రణితల మీద సాగుతూ సినిమాలోకి పోయే కొద్దీ మరికొన్ని ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతుంది.

ప్రశ్న) డైనమైట్ లో జెడి చక్రవర్తి చేసిన నెగటివ్ రోల్ గురించి చెప్పండి.?

స) విలన్ గా జెడి చరవర్తి సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సినిమాలోకి అతని పాత్ర ఎంటర్ అవ్వగానే సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. బ్రిలియంట్ యాక్టర్, ఈ సినిమాతో అందరినీ షాక్ కి గురయ్యేలా చేస్తాడు.

ప్రశ్న) ‘డైనమైట్’ సినిమాకి హైలైట్ గా నిలిచే అంశాలు ఏమిటి.?

స) విజయన్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు మరియు మంచు విష్ణు – ప్రణితల మధ్య వచ్చే లవ్ ట్రాక్ లు డైనమైట్ కి మేజర్ హైలైట్స్ అవుతాయి.

ప్రశ్న) సినిమా అనుకున్న టైం కంటే కాస్త ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏమిటి.?

స) చాలా రోజుల క్రితమే మా సినిమా రెడీగా ఉంది. బాహుబలి సినిమా వల్ల అప్పుడు హోల్డ్ లో పెట్టి రైట్ టైం చూసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం.

ప్రశ్న) మీ ఫెయిల్యూర్ అయిన ‘ఆటో నగర్ సూర్య’ గురించి మీకు మీరు సమీక్షించుకున్నారా.?

స) అవును. కచ్చితంగా సమీక్షించుకుంటాను. ఆటో నగర్ సూర్య స్క్రిప్ట్ చాలా బాగుంటుంది కానీ చాలా ఎగ్జిక్యూట్ చాలా బాడ్ గా ఉంటుంది. నాకు తెలిసి సినిమా ఫెయిల్యూర్ గురించి చాలా ఎక్కువ చెప్పారు, అలాగే నా గురించి కూడా చాలా నెగటివ్ గా రాసారు.

ప్రశ్న) ఆ విషయాన్ని కాస్త విడమర్చి చెప్పగలరా.?

స) ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో నాకు గురించి చాలా రూమర్స్ వచ్చాయి.. ఎలా అంటే నా వల్లే సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోయిందని, సినిమా డిలే అవ్వడానికి అలాగే సినిమా ఫెయిల్యూర్ కి నేనే కారణం అని అన్నారు. కానీ సినిమాని 9 కోట్ల బడ్జెట్ లో చాలా బాగా తీసాం, చాలా విషయాల్లో ఆ సినిమాకి ప్రశంశలు కూడా వచ్చాయి. ఈ విషయాలు నన్ను బాగా నిరుత్సాహపరిచాయి, అలాగే ఇండస్ట్రీకి నాకు మధ్య బాగా గ్యాప్ ని పెంచేశాయి.

ప్రశ్న) ఇప్పుడు మీ స్క్రిప్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారా.?

స) అవును.. ఇప్పటి నుంచి నేను నాకు నమ్మిన వారితో మరియు క్రియేటివ్ ఫ్రీడం ఉన్నవారితో సినిమాలు చేస్తాను. విష్ణు నాకు ఆ ఫ్రీడం ఇచ్చాడు, ఆ ఫ్రీడం రిజల్ట్ ఎలా ఉంటుందనేది నేను మాట్లాడను, సినిమానే మాట్లాడుతుంది.

ప్రశ్న) మీరు తదుపరి చేయనున్న సినిమాల విశేషాలు చెప్పండి.?

స) ప్రస్తుతం నా దగ్గర నాలుగు కథలు ఉన్నాయి, అవన్నీ పలువురుతో డిష్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక నుంచి నా సినిమాలలో ఎక్కువ గ్యాప్ ఉండదు. అలాగే అందరికి నచ్చే క్వాలిటీ ప్రోడక్ట్ నే అందిస్తానని మాత్రం చెప్పగలను.

Exit mobile version