వరుణ్ తేజ్‌పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి!

rajmouli
వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్యే ‘ముకుందా’తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించిన హీరో. మొదటి సినిమాకే కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాకుండా ఓ మంచి కథతో వచ్చి మెప్పించిన వరుణ్, తన రెండో సినిమా ‘కంచె’ను మరింత కొత్తగా, ఇంతకుముందు తెలుగు సినిమాలో ఎప్పుడూ చూడని నేపథ్యంలో నడిచే కథతో మనముందుకు తీసుకొస్తున్నారు. విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యానికి ఓ ప్రేమకథతో లింక్ చేసిన సినిమాగా కనిపిస్తోంది.

ఇప్పటికే టీజర్, పోస్టర్స్‌తో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు హైద్రాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి, ఆ తర్వాత మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కథల ఎంపిక చాలా బాగుందని, ఇంటెరెస్టింగ్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ రూపొందించుకుంటున్న వరుణ్, ఇదే పంథాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని రాజమౌళి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇక ఇదిలా ఉంటే ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచే సినీ పరిశ్రమ ప్రముఖుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. క్రిష్ ఎంచుకున్న నేపథ్యానికి, అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను చెప్తోన్న విధానానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Exit mobile version