ఈ రెండింటిలో ఎన్.టి.ఆర్ 25వ సినిమా టైటిల్ ఏది.?

Ntr
యంగ్ టైగర్ ఎన్.టిఆర్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్లో జరుగుతోంది. షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇప్పటి వరకూ ఈ సినిమాకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలించారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కూడా ఇదే టైటిల్ ఖరారు చేసారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. అదే ‘అభిరామ్’.

ఉన్నపాటుగా ఈ టైటిల్ వెలుగులోకి రావడానికి కారణం ఈ చిత్ర నిర్మాతలైన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిష్టర్ చేయడం. తాజాగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయడం, అలాగే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్ర పేరు కూడా అభిరామ్ కావడం వలన ఎన్.టి.ఆర్ 25వ సినిమాకి అభిరామ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే వారి దగ్గర ఉన్న ‘నాన్నకు ప్రేమతో’, ‘అభిరామ్’ అనే టైటిల్స్ లో ఒక దానిని ఫైనలైజ్ చేసి ఫైనల్ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు.

ఎన్.టి.ఆర్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version