సూర్యనే కాదు కార్తీని కూడా దత్తత తీసుకున్నాం.. వరుస తెలుగు ప్రాజెక్ట్స్ తో కార్తీ?

Karthi

ఇతర భాషల నుంచి వచ్చిన హీరోలని అయినా సరే ఓ రేంజ్ ఆరాధించాలి అంటే అది మన తెలుగు ఆడియెన్స్ వల్లే అవుతుంది. అలా కోలీవుడ్ నుంచి వచ్చిన ఎంతోమంది స్టార్స్ ని మనం ఆదరించాం. అయితే అలాంటి హీరోస్ లో తెలుగు స్టేట్స్ దత్తత తీసుకున్న హీరోగా సూర్య పేరు ఎక్కువ వినిపిస్తుంది ప్రస్తుత జెనరేషన్ లో కానీ సూర్యతో పాటుగా తన సోదరుడు కార్తీ కూడా తెలుగులో మంచి బ్రాండ్ అండ్ మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు.

అయితే ఇపుడు సూర్యని మించి తెలుగు ఇండస్ట్రీలో కార్తీకి స్కోప్ దక్కనుందా అంటే ఇప్పుడు పరిస్థితి అలానే ఉందని చెప్పొచ్చు. డబ్బింగ్ సినిమాలతోనే మంచి ఫేమ్ అందుకున్న కార్తీ ఇపుడు తెలుగులో వరుస సినిమాలు చేయనున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ గానే మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో ఓ సినిమా సితార బ్యానర్ లో లాక్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

అంతే కాకుండా మొన్నామధ్య బోయపాటి శ్రీనుతో కూడా సినిమా ఉండొచ్చనే టాక్ కూడా వచ్చింది. దీనితో పాటుగా ‘హిట్ 3’ ఇదీ తెలుగు సినిమానే ఇంకా ఇతర యంగ్ దర్శకులు చాలామంది తోనే ఇపుడు కార్తీ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ రకంగా కార్తీ మన తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర కానున్నాడు అని చెప్పొచ్చు.

Exit mobile version