‘బాహుబలి-ది కంక్లూజన్’ మొదలెట్టిన రాజమౌళి & టీం

rajmouli
ఒక్కసారిగా ఇండియన్ సినిమా మొత్తం తెలుగు చిత్ర సీమవైపు చూసేలా చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాకి గాను టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పై ప్రశంశల జల్లు కురిపించారు. తెలుగు వారంతా కాలర్ ఎగరేసుకునేలా చేసిన ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డ్స్ ని సృష్టించడమే కాకుండా అందరి మదిలో ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?’ అనే ప్రశ్నని కూడా బుర్రలోకి ఎక్కించేసారు. దాంతో బాహుబలి ఫస్ట్ పార్ట్ కి ముగింపుగా రానున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత కొద్ది రోజులుగా బాహుబలి 2 మీద వర్క్ చేస్తున్న రాజమౌళి ఇటీవలే తన ఫ్యామిలీ తో కలిసి ఫైనల్ హాలిడే కోసం బాలి వెళ్ళొచ్చాడు. దాంతో ఇక సెలవులకు సెలవు ప్రకటించి ఫుల్ ప్లెడ్జ్ గా బాహుబలి 2 మీద దృష్టి పెట్టాడు. అందులో భాగంగా బాహుబలి 2 ఫైనల్ వెర్షన్ కథ చర్చలు మొదలయ్యాయి. అందులో భాగంగానే రాజమౌళి ఈ చిత్ర టీం బాహుబలి కంక్లూజన్ ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ ని టీంకి నేరేట్ చేసాడు. మళ్ళీ దీనిలో చిన్న మార్పులు ఏమన్నా ఉంటె చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారు. ముఖ్యంగా రాజమౌళి బాహుబలి సీక్వెల్ పై పెరిగిపోయిన అంచనాల మేరకు పార్ట్ 2 లో ఒక గంట పాటు వచ్చే వార్ ఎపిసోడ్ ని పూర్తిగా రీ డిజైన్ చేస్తున్నాడు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఇంకా 120 రోజులపైనే షూటింగ్ చేయాల్సి ఉంది.

Exit mobile version