ఎనర్జిటిక్ రామ్.. ఎనర్జిటిక్ ‘శివమ్’ ట్రైలర్..!

Shivam

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా సినిమా ‘శివమ్’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి కిషోర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆడియోతో పాటు, థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ థియేట్రికల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ లవ్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తూ ఎనర్జిటిక్‌గా ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే సినిమా హీరో క్యారెక్టరైజేషన్‌ను హైలైట్ చేసుకొని నడిచే సినిమాగా కనిపిస్తోంది. “నా పేరు శివ, నాది చాలా సింపుల్ ఫండా. మనకు నచ్చిన అమ్మాయి తగిలే వరకూ వెయిట్ చేయాలి. తర్వాత తనకోసమే ఫైట్ చేయాలి” అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్ ఎనర్జిటిక్‌గా రామ్ చెప్పే యాక్షన్ డైలాగ్‌తో ముగుస్తుంది. సినిమాలో భారీ తారాగణమే ఉన్న విషయం ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇక ట్రైలర్ ద్వారా సినిమాపై మంచి ఆసక్తి కలిగించడంలో సినిమా యూనిట్ సక్సెస్ సాధించిందనే చెప్పాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version