తేజ వ్యాఖ్యలను పట్టించుకోని మహేష్

Mahesh-Babu

హోరాహోరి సినిమా ప్రచారాలలో భాగంగా దర్శకుడు తేజ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు గుర్తుండే వుంటాయి. సినిమా సెలబ్రిటీలు పల్లెటూర్లను దత్తత తీసుకునే విషయంపై స్పందిస్తూ అలా చేస్తే వారికి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు వుంటుందని అందుకే ఈ పనులన్నీ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపధ్యంలో ఈ కామెంట్స్ దుమారం రేగాయి.

దీనికి మహేష్ బాబు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ తాను ఇటువంటి కామెంట్లను పట్టించుకోనని, తేజ ఏ ఉద్దేశంలో అన్నాడో తనకు తెలియదుగానీ తనకు మాత్రం ఎటువంటి పట్టింపులు లేవని స్పష్టం చేశాడు. సమంతా విషయంలో సైతం ఇటువంటి కామెంట్లు ఎదుర్కున్నా వాటిని పరిష్కరించుకుని ఇద్దరూ ప్రస్తుతం ఒకే సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసినదే.

Exit mobile version