బిగ్ ట్విస్ట్ తో ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ధురంధర్ 2’.. కానీ ఇక్కడే మరో ట్విస్ట్!

Dhurandhar-2

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ధురంధర్ 2” అనే చెప్పాలి. దర్శకుడు ఆదిత్య ధర్ హీరో రణ్వీర్ సింగ్ కలయికలో చేసిన ధురంధర్ పార్ట్ 1 కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకోగా అంతా ఓటిటి రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో అంతా జూన్ రిలీజ్ కే అని ప్రిపేర్ అయ్యి ఉన్నారు కానీ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ బిగ్ ట్విస్ట్ ఇపుడు ఇచ్చింది. అదేంటీ పార్ట్ 2 జియో హాట్ స్టార్ తీసుకుందిగా అంటే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో పార్ట్ 2 స్ట్రీమింగ్ డేట్ గా ఈ మే 14 కనిపిస్తుంది. దీనితో ఇది వైరల్ గా మారింది.

పైగా నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్ ది రివెంజ్ (రా అండ్ అన్ దేఖా) అంటూ మొత్తం 3 గంటల 52 నిమిషాల సినిమా వస్తుంది అని పెట్టారు. అయితే ఇది ఇండియాలో కాదు ఓవర్సీస్ మార్కెట్ లో అన్నట్టు తెలుస్తుంది. ఇండియా వరకు ఈ సినిమా జియో హాట్ స్టార్ లో ఇదే డేట్ లో వస్తుందా లేక కొత్త డేట్ లో వస్తుందా అనేది వేచి చూడాలి. ఇది మాత్రం ఓటిటి ఆడియెన్స్ కి ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి.

Exit mobile version