
‘పెళ్ళైన కొత్తలో’, ‘యమ దొంగ’, ‘ప్రవరాఖ్యుడు’, ‘రగడ’ లాంటి సినిమాల్లో నటించిన హాట్ బ్యూటీ ప్రియమణి ఈ మధ్య తెలుగు సినిమాలకు టెంపరరీగా బ్రేక్ ఇచ్చి కంటిన్యూగా మలయాళం, కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు అడపాదడపా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ప్రియమణి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వచ్చాయి.
కానీ అందులో ఎలాంటి నిజం లేదని ప్రియమణి మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రియమణి తను నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యుఎస్ లో ఉంది. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అసలు ప్రియమణిని ఇదివరకూ అప్రోచ్ కాలేదని తెలిపాడు. దీంతో ఈ వార్తలకి తెరపడింది. ప్రియమణి తెలుగులో చివరిగా నటించిన ‘చండీ’ సినిమా 2013లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకూ మరో సినిమాలో కనిపించలేదు.