నందిని రెడ్డి.. ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకురాలు. మహిళా దర్శకులు ఎప్పుడో గానీ కనపడని పరిశ్రమలో మొదటి సినిమాతోనే తనదైన మార్క్ చూపెట్టిన నందిని రెడ్డి, తాజాగా నాగశౌర్యతో చేస్తోన్న ‘కళ్యాణ వైభోగమే’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. రెండో సినిమా జబర్దస్త్ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నందిని, ఇప్పుడు కళ్యాణ వైభోగమేతో మళ్ళీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు.
ఇక ఇప్పటికే టాకీ పార్ట్‌తో పాటు కొన్ని పాటలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని క్రూగ్ ప్రాంతంలో జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా సమాంతరంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక త్వరలోనే జరగనుంది. నాగశౌర్య సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూర్చారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
