రొమాంటిక్ ఎంటర్టైనర్ కి సిద్దమవుతున్న అడవి బ్రదర్స్

adivi-brothers
కర్మ, కిస్ సినిమాలతో హీరోగా పరిచయం అయిన అడవి శేష్ కి పంజా మరియు రీసెంట్ గా వచ్చిన బాహుబలి సినిమాలు భారీ గుర్తింపుని ఇచ్చాయి. అలాగే తను సోలో హీరోగా చేసిన దొంగాట సినిమా కొసా ఈ ఏడాది మంచి విజయాన్నే అందుకుంది. ఇది కాకుండా ప్రస్తుతం పివిపి బ్యానర్ లో క్షణం అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే వినాయకుడు సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన అతని బ్రదర్ సాయి కిరణ్ అడవి కూడా ఈ ఏడాది కేరింత సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఇప్పడు సక్సెస్ లో ఉన్న వీరిద్దరూ కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే సాయి కిరణ్ అడవి స్క్రిప్ట్ కి సంబందించిన వర్క్ ని ఫినిష్ చేసారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా లావణ్య త్రిపాటి – నందిత రాజ్ లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా లాంచ్ గురించి అధికారిక అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు. బాహుబలి సినిమాతో అడవి శేష్ కి ఆఫర్స్ బాగా వస్తున్నాయి. త్వరలో రానున్న క్రేజీ ప్రాజెక్ట్స్ సైజ్ జీరో, ఊపిరిలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నాడు.

Exit mobile version