సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది

Sathi-Leelavathi

విడుదల తేదీ : మే 8, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, నరేష్, విటివి గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి తదితరులు
దర్శకుడు : తాతినేని సత్య
నిర్మాత : నాగ మోహన్
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ : బినేంద్ర మీనన్
ఎడిటింగ్ : సతీష్ సూర్య

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ డ్రామా ‘సతీ లీలావతి’ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ఒక ఫిల్మ్ డైరెక్టర్ అయిన లీల(లావణ్య త్రిపాఠి), తన చిన్ననాటి స్నేహితుడు రామ్ సేతు(దేవ్ మోహన్)ని వివాహం చేసుకుంటుంది. అయితే, వీరి వైవాహిక జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో లీల ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అసలు ఆ నిర్ణయం ఏమిటి? ఈ జంట విడిపోయారా లేక తమ సమస్యలను పరిష్కరించుకున్నారా? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

లీల పాత్రలో లావణ్య చాలా మెచ్యూర్డ్‌గా నటించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఆమె పాత్రలోని షేడ్స్, క్రేజీ మేనరిజమ్స్ బాగున్నాయి. లావణ్య ఈ సినిమాని తన భుజాన వేసుకుని నడిపించింది.

సినిమా ప్రారంభం ప్రామిసింగ్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ఫేస్-ఆఫ్ సీన్స్, జాఫర్ సాదిక్ కామెడీ ట్రాక్ అక్కడక్కడ నవ్విస్తాయి. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని ఫన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి.

మైనస్ పాయింట్స్:

భార్యభర్తల మధ్య తలెత్తే సమస్యలను ఈ సినిమా ద్వారా వివరించాలని మేకర్స్ ప్రయత్నించారు. అయితే, సినిమా సగం పూర్తయ్యేసరికి కథ ట్రాక్ తప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో లీడ్ పెయిర్‌పై పెట్టిన ఫోకస్, సెకండ్ హాఫ్‌లో మిస్ అయ్యింది. కొన్ని కామెడీ ట్రాక్స్ కోసం రాసుకున్న ఎపిసోడ్స్‌ మెప్పించవు.

సెకండాఫ్‌లోని ఫన్ ఎపిసోడ్స్ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ ట్రాక్స్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోవు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ యాంగిల్‌లో డెప్త్, లాజిక్ మిస్ అయ్యాయి.

ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసినా, ఇందులోని డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులను విసిగిస్తాయి. దేవ్ మోహన్ పాత్ర డబ్బింగ్ ఆయన యాక్టింగ్‌పై ప్రభావం చూపింది. మడోనా సెబాస్టియన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రను రాసుకున్నారు. విటివి గణేష్, నరేష్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు తాతినేని సత్య నేటి కాలానికి సరిపడే మంచి సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ, దానిని ఆసక్తికరమైన కథనంతో మలచడంలో తడబడ్డారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఫస్ట్ హాఫ్‌లోని పెళ్లి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఓవరాల్‌గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ మరియు పర్వాలేదనిపించే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్స్, మెయిన్ ప్లాట్ నుంచి కథ డీవియేట్ కావడం మైనస్. ఈ వీకెండ్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version