టాప్ స్టార్స్ మీద ఐటి రైడ్స్

vijay-sam-nayana
బాగా ధనవంతులు, టాప్ బిజినెస్ మాన్స్ మరియు ఫేమస్ సెలబ్రిటీస్ ఇళ్ళ మీద ఇన్కం టాక్స్ రైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇన్కం టాక్స్ వారు సినీ ప్రముఖుల ఇళ్ళపై కూడా ఆకస్మిక రైడ్స్ నిర్వహిస్తుంటారు. అలా తాజాగా ఇన్కం టాక్ అధికారులు చెన్న సినీ ప్రముఖులను కొంతమందిని టార్గెట్ చేసి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ సెలబ్రిటీస్ లిస్టులో తమిళ స్టార్ హీరో ఇలయతలపథి విజయ్, స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతారలు కూడా ఉన్నారు.

ఈ రోజు ఉదయం నుంచి వీరి ఇళ్ళలో అన్ని ఆస్తులను చెక్ చేస్తున్నారు, అలాగే వారి దగ్గర ఉన్న స్థలాల పేపర్స్ ని కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి కాలేదు. ఇన్కం టాక్స్ రైడ్స్ మొత్తం పూర్తయ్యాక ఏమన్నా తప్పులు ఉంటే బయటపడవచ్చు. విజయ్, సమంత, నయనతారలు రీసెంట్ టైమ్స్ లో వరుసగా హిట్స్ అందుకొని వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా విజయ్ నటించిన పులి సినిమా రేపు విడుదల కానుంది. ఈ టైంలో ఇన్కం టాక్స్ వారు రైడ్ చేసారు.

Exit mobile version