
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయిని మరింత రెట్టింపు చేసే సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన బాహుబలి ఇప్పటికే ఎనలేని కీర్తిని సంపాదించుకోగా త్వరలోనే రుద్రమదేవి రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు తెలుగు స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని రెండవ ప్రపంచయుద్దాన్ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రేమకథా చిత్రం ‘కంచె’. మానవతా విలువలు, మాన సంబంధాల గురించి ఎక్కువగా ప్రస్తావించే క్రిష్ దర్శకత్వం వహించిన ఈ కంచె సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫైనల్ కాపీని సిద్దం చేసిన ఈ చిత్ర టీం ఈ రోజు కంచె ని సెన్సార్ ఫార్మాలిటీస్ కోసం పంపారు. మరి కొద్ది సేపట్లో కంచె సెన్సార్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం లోపు అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ చిత్ర టీం అధికారిక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. చిరంతన్ భట్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.