స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అక్కినేని ఫ్యామిలీని తెలుగు చలన చరిత్ర చరిత్రలో మరింత ఉన్నత స్థానాలకి తీసుకెళ్ళడానికి అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నటవారాసుడు అఖిల్ అక్కినేని త్వరలోనే తన మొదటి సినిమా ‘అఖిల్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మొదటి సినిమాతోనే అఖిల్ అందరి తెలుగువారికి రీచ్ అయిపోవాలని తన పేరునే తన మొదటి సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నాడు. నాగార్జున కూడా తన కుమారుడి మొదటి సినిమా లాంచ్ కోసం తనవంతు కృషి, సపోర్ట్ ని అఖిల్ కిఇస్తున్నాడు.
కేవలం అవుట్ సైడ్ మాత్రమే కాకుండా సినిమాలో కూడా కనిపించి సినిమాకి మరింత క్రేజ్ తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందుకే నాగార్జున – నాగ చైతన్య కలిసి అఖిల్ సినిమాలో ఓ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారని సమాచారం. అది కూడా అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ లో అఖిల్ తో కలిసి కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ సీన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. కచ్చితంగా వీరు ముగ్గురు స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు పండగనే చెప్పాలి.
వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించిన ఈ సినిమా అక్టోబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
