ప్రభాస్ ఫస్ట్ కమర్షియల్ యాడ్ అదుర్స్.!

Prabhas-in-Mahindra-TUV-300
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ వైడ్ బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ప్రభాస్ కి పలు బ్రాండ్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయమని ఆఫర్స్ రాగా ప్రభాస్ మొదటగా మహీంద్ర కంపెనీ వెహికల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు. అందులో మొదటగా మహీంద్ర TUV 300కి ప్రచార కర్తగా మారడమే కాకుండా, ఆ వెహికల్ కోసం మొదటి యాడ్ ని కూడా ప్రభాస్ పై షూట్ చేసాడు.

మహీంద్ర TUV 300 టీవీ కమర్షియల్ యాడ్ ని నిన్న రిలీజ్ చేసారు. ఈ యాడ్ లో ప్రభాస్ హైట్, బాడీ, మాచో లుక్ ని బాగా వాడుకున్నారు. ఈ కమర్షియల్ యాడ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో పలువురు ఓ హాలీవుడ్ స్టైల్ సీన్ లా యాడ్ ని షూట్ చేసారని, ప్రభాస్ ని బాగా చూపించారని కితాబులిస్తున్నారు. దీని తర్వాత మరిన్ని యాడ్స్ ని రిలీజ్ చెయ్యడానికి మహీంద్ర కంపెనీ ఆలోచిస్తోంది. మరోవైపు బాహుబలి తర్వాత మళ్ళీ స్క్రీన్ పై ప్రభాస్ కనిపిస్తుండడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. మహీంద్ర కాకుండా పలు బ్రాండ్స్ కూడా ప్రభాస్ లిస్టులో ఉన్నాయి, త్వరలోనే మరొకొన్ని బ్రాండ్స్ కి సైన్ చేసే అవకాశం ఉంది.

Exit mobile version