‘శివమ్’ శాటిలైట్ రైట్స్ కి ఊహించని బంపర్ ప్రైజ్.!

Shivam
కడుపుబ్బా నవ్వే కామెడీ, యాక్షన్, లవ్ స్టొరీ.. ఇలా అన్నీ సమంగా ఉండే కథలతో సినిమా వచ్చింది అంటే కచ్చితంగా బాక్స్ ఆఫీసు వద్ద కాసులు రాల్చుకొని వెళ్ళిపోతుంది. అలాంటి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ అదే తరహాలో చేసిన సినిమా ‘శివమ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, జోరుగా ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా రేపు అనగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాజిటివ్ టాక్ తో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగా జరుగిందని ఇదివరకే తెలియజేశాం.

కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్ కి కూడా సూపర్బ్ క్రేజ్ నెలకొంది. మాకు అందిన సమాచారం ప్రకారం శివమ్ సినిమా శాటిలైట్ రైట్స్ కి నిర్మాతలు కూడా ఊహించని రేటు రావడంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు. జెమినీ టీవీ వారు శివమ్ శాటిలైట్ రైట్స్ ని 5.5 కోట్లకి కొనుగోలు చేసారు. సినిమా రిలీజ్ కి ముందే శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ కి అమ్ముడు పోయి టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టడంతో ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ చాలా చాలా హ్యాపీగా ఉంది. రామ్ సరసన రాశి ఖాన్న జోడీ కట్టిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version