
‘మనం’ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న కింగ్ నాగార్జున నటిస్తున్న తదుపరి తదుపరి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాలో కూడా నాగార్జున ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఆగష్టు 29న నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆత్మల కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా ఆధ్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి నాగార్జున మరియు అతని ప్రొడక్షన్ టీం ప్లాన్ చేసినట్లు ఇది వరకే తెలియజేశాం.
కానీ తాజా సమాచారం ప్రకారం సినిమా మొత్తాని ఎడిట్ రూంలో చూసుకున్న ఈ చిత్ర టీం కి కొన్ని కీలక సీన్స్ సరిగా వచ్చినట్టు లేదని అనిపించిందట. అందుకే ప్రస్తుతం మళ్ళీ ఆ సీన్స్ ని రీ షూట్ చేసే పనిలో ఉన్నారు ఈ చిత్ర టీం. నాగార్జునతో పాటు అందరు కీలక నటీనటులు మళ్ళీ రీ షూట్ లో పాల్గొంటున్నారు. మేజర్ గా కొన్ని సీన్స్ మాత్రమె కావడం వలన ఈ చిత్ర టీం రీ షూట్ చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్న సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.